గోకవరం ఆర్టీసీ డిపోలో కార్గో డోర్ డెలివరీ మాస ఉత్సవాలను జనవరి 19వ తేదీన నిర్వహిస్తున్నట్లు డీఎం రామన్న దొర బుధవారం తెలిపారు. లాజిస్టిక్ పార్సిల్, కొరియర్ సర్వీస్ ద్వారా అతి తక్కువ ఖర్చుతో ప్రయాణికుల సరుకులు పంపించుకోవచ్చని అన్నారు. ఏజెన్సీ మండలాల్లోని గిరిజనులు, మైదాన ప్రాంతాల్లోని ప్రజలు ఆర్టీసీ కార్గో సర్వీసులను ఉపయోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.