జగ్గంపేట: షార్ట్ సర్క్యూట్ కారణంగా తాటాకు ఇల్లు దగ్ధం

69చూసినవారు
జగ్గంపేట: షార్ట్ సర్క్యూట్ కారణంగా తాటాకు ఇల్లు దగ్ధం
కిర్లంపూడి మండలం సోమవరం గ్రామంలో దళిత పేటలో మాసా అర్జమ్మ అనే వృద్ధురాలి తాటాకు ఇల్లు విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా శుక్రవారం రాత్రి కాలిపోయింది. ఇంటి పైకప్పు నుంచి మంటలు వ్యాపించడంతో ఇంట్లోనే ఉన్న అర్జమ్మ బయటకు పరుగులు తీసింది. స్థానిక యువకులు బకెట్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేయగా ఇల్లు మొత్తం కాలిపోయింది. ఇంటిలో వస్తువులు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని అధికారులను కోరారు.

సంబంధిత పోస్ట్