ప్రభుత్వం ఏర్పడ్డ వంద రోజుల్లోనే ప్రజల మన్ననలు పొందిన ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వమని కాకినాడ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ షణ్మోసన్ సగిలి అన్నారు. కూటమి ప్రభుత్వం 100 రోజులలో సాధించిన ప్రగతిపై ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కాకినాడ లో పర్లోవపేట ఏఎంజిస్కూల్ ప్రాంగణంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు.