కొవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తించిన వైద్యాధికారులకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అని డాక్టర్ రవి కుమార్ పేర్కొన్నారు. శనివారం కాకినాడ డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంబీబీఎస్ వైద్యాధికారులకు కొనసాగిస్తున్న కోటా ప్రకారమే పీజీ వైద్య విద్యార్థుల కోర్సుల్లో ప్రవేశ కల్పించాలని డిమాండ్ చేశారు.