కాకినాడ నగరంలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వాతావరణ శాఖ హెచ్చరికలు నేపథ్యంలో కాకినాడలో వర్షం కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి . దేవాలయ వీధి, సినిమా రోడ్డు పైకి వర్షం నీరు రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మూడు రోజుల పాటు నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ షణ్మోసన్ ఆదేశాలు జారీ చేశారు.