యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ, వార్డు హెల్త్ సెక్రటరీలను వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోకి తీసుకురావాలని కోరుతూ కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద సోమవారం సచివాలయ ఏఎన్ఎంలు ధర్నా నిర్వహించారు. ఏపీ యునైటెడ్ విలేజ్ అండ్ వార్డ్ హెల్త్ సెక్రటరీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నీరజ మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలు అందించారన్నారు.