ఇంటి, కుళాయి పన్నుల వసూలుపై రెవెన్యూ విభాగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన ఐఏఎస్ ఆదేశించారు. శనివారం సాయంత్రం నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ భావన రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బందితోసమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ భావన మాట్లాడుతూ 50 శాతం మేర ఉన్న పన్నుల బకాయి భారాన్ని తగ్గించాల్సిన బాధ్యత రెవెన్యు ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బంది పై ఉందన్నారు.