విజ్ఞాన ప్రదర్శనలు విద్యార్థుల్లో దాగి ఉన్న మేధస్సుకు పదునుపెడతాయని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. శనివారం రాజమండ్రిలోని శ్రీసత్యసాయి గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన తూర్పుగోదావరి జిల్లా విద్య వైజ్ఞానిక ప్రదర్శన, సౌత్ ఇండియా సైన్స్ ఫెస్ట్ 87ను కలెక్టర్ ప్రశాంతి, ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి ప్రారంభించారు. విద్యార్థులు రూపొందించిన పలు ప్రాజెక్టులను పరిశీలించి, వారిని అభినందించారు.