కార్తీక బహుళ త్రయోదశి గురువారం సందర్భంగా కాకినాడ రూరల్ అరట్లకట్ట శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో శనివారం నందోత్సవం జరిగింది. కార్యక్రమంలో భాగంగా అర్చకులు కొంతేటి శివ శర్మ, పిఠాపురం పాదగయ ఆలయ అర్చకులు కోట వీర వేంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో నందీశ్వరునికి అభిషేకం అనంతరం ఉమా జ్యోతిర్లింగార్చన, దీపాలంకరణ సేవ, సహస్ర నామార్చన నీరాజన మంత్రపుష్పములు, తీర్థప్రసాద వితరణ జరిగాయి.