కాకినాడ రూరల్ సాగర తీరాన వెలసిన శ్రీశ్రీశ్రీ మంగళాంబిక సమేత శ్రీ ఆది కుంభేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ఒక కోటి ఎనిమిది లక్షల శివలింగాలకు 49వ మహాకుంభాభిషేకంను ఆదివారం నిర్వహించారు. కార్తీక అమావాస్య మహా పవిత్ర పర్వదినాన విఘ్నేశ్వర పూజ, పంచ కాటక పఠనం, వేద పఠనం చేసి కోటీ ఎనిమిది లక్షల శివలింగాలకు మహా కుంభాభిషేకమును నిర్వహించారు. రసలింగేశ్వరునికి విభూదితో మహా కుంభాభిషేకం నిర్వహించారు.