తూరంగి పంచాయతీ పరిధి, అల్లూరి సీతారామరాజు కాలనీలో ఉన్న సర్వే నెంబర్ 217 / 26 లో ఉన్న సామాజిక స్థలంలో జరుగుతున్న ఆక్రమ కట్టడాలను సీపీఎం పార్టీ రూరల్ కమిటీ బృందం ఈ ప్రాంతాన్ని శనివారం పరిశీలించింది. ఈ సందర్భంగా పార్టి కన్వీనర్ తిరుమల శెట్టి నాగేశ్వరరావు మట్లాడుతూ పార్క్, వాకింగ్ ట్రాక్ స్థలంలో పక్కన ఉన్న సామాజిక స్థలంలో అక్రమ కట్టడాలు జరుగుతుందని తెలిపారు.