గత13ఏళ్లుగా స్థానిక పాలన లేకుండా కాకినాడ పరిసర అర్బన్ గ్రామాలను పంచాయతీ పాలన నుండి వేరు చేయడం వలన 150 కోట్లరూపాయల అభివృద్ధి నిధులు చేజారి పోయాయని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణ రాజు పేర్కొన్నారు. కార్పోరేషన్ లో విలీనం చేస్తే స్మార్ట్ సిటీ నిధులు 10 వేల కోట్లు వచ్చి వుండేవని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసారు. శుక్రవారం స్థానిక వివేక్ భవన్ లో పౌర సంక్షేమ సంఘం కార్యనిర్వహక వర్గ సమావేశం జరిగింది.