హాస్పిటల్ పై దాడి ఘటనలో ముద్దాయిల అరెస్టు

64చూసినవారు
రావులపాలెం లోని ఒక నర్సింగ్ హోమ్ పై శుక్రవారం జరిగిన దాడి ఘటన లో ఆరుగురు ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేశారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం లోని ఒక నర్సింగ్ హోమ్ పై కొందరు దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు అందింది. బాధితుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలంలోని సిసి ఫుటేజ్ ల ఆధారంగా ఆరుగురు వ్యక్తులపై కేసునమోదు చేశారు. వారిని శనివారం కొత్తపేట ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు.

సంబంధిత పోస్ట్