అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీని మంగళవారం సీజ్ చేసినట్లు ఆత్రేయపురం ఎస్సై ఎస్. రాము తెలిపారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం తాడిపూడి గ్రామంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీ పట్టుకుని పరిశీలించగా వారి వద్ద ఎటువంటి అనుమతులు లేకపోవడంతో లారీని మరియు 6 యూనిట్ల ఇసుకని స్వాధీన పరుచుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాము తెలిపారు.