అన్ని సచివాలయాలకు సిసి కెమెరాలను ఏర్పాటు చేయండి

367చూసినవారు
అన్ని సచివాలయాలకు సిసి కెమెరాలను ఏర్పాటు చేయండి
ఆలమూరు మండలంలో గల అన్ని సచివాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ మండల పరిధి గుమ్మిలేరు గ్రామ సర్పంచ్ గుణ్ణం రాంబాబు స్థానిక ఎంపీడీవో కే జాన్ లింకన్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా గుణ్ణం మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం వలన సచివాలయ సిబ్బందిలో జవాబుదారితనం ఉంటుందని, సచివాలయాలకు వచ్చే ప్రజలకు సిబ్బంది అందించే సేవలు ప్రత్యక్షంగా చూడగలుగుతామని అన్నారు. వచ్చే మండల సమావేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటుపై చర్చించి తగు చర్యలు చేపడతామని ఎంపీడీవో సర్పంచ్ కు హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్