కొత్తపేట మండలం పలివెల వంతెనకు ఇరువైపులా దట్టంగా పిచ్చి మొక్కలు పెరిగి పోవడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమలాపురం నుంచి రావులపాలెం వెళ్ళు ప్రతి వాహనం ఈ వంతెన మీదుగా వెళ్లాల్సిందే. "ఎస్"ఆకారంలో ఇరుకుగా ఉండే ఈ వంతెనపై గతంలో అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కావున అధికారులు వెంటనే స్పందించి దట్టంగా పెరిగిన డొంకలను తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు.