కష్ట కాలంలో పార్టీకి అండగా ఉండి కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తానని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పార్టీ కార్యకర్తలకు హామీ ఇచ్చారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో గ్రామంలో శుక్రవారం పార్టీ అధ్యక్షులు ముదునూరి వెంకట్రాజు అధ్యక్షతన జరిగిన మండల తెలుగుదేశం పార్టీ సమావేశంలో సత్యానందరావు, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, బండారు సంజీవ్ పాల్గొన్నారు.