చాగల్లు నుంచి లక్ష్మీపురం వరకు నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పంచాయతీ రాజ్ ద్వారా సుమారు రూ. 8 కోట్లు వ్యయంతో రోడ్డును నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఈ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.