రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ వైసీపీ ఆధ్వర్యంలో డిసెంబర్ 27 తేదీన నిర్వహించే పోరుబాటలో నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కొవ్వూరు వైసీపీ ఇన్‌ఛార్జి తలారి వెంకట్రావు కోరారు. గురువారం కొవ్వూరు పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రేపు 10 గంటలకు విజయ విహార్ సెంటర్కు రావాలని కోరారు.