తాళ్లపూడి గ్రామంలోని శ్రీ నవదుర్గాది పరివార శ్రీ చక్ర సహిత శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో మంగళవారం రాత్రి మహా కుంభాభిషేకం, శత చండీయాగం మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రముఖ ప్రవచన కర్త పద్మశ్రీ గరికపాటి నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రవచనాలతో భక్తులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గరికపాటి ప్రవచనాలను ఆలకించారు.