సెప్టెంబరు 1న ఆదివారం సెలవు నేపథ్యంలో ఒకరోజు ముందుగానే ఈ నెల 31న సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తానని మండపేట పురపాలక సంఘం కమిషనర్ బి. రాము శుక్రవారం పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. పింఛనుదారులు అందుబాటులో లేకపోతే సెప్టెంబరు 2న అందజేస్తామన్నారు. పింఛన్ దారులు ఈ నెల 31న ఇళ్లలో ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.