మండపేట రైతు బజార్ వద్ద కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మంగళవారం కౌన్సిల్ ఆమోదం లభించింది. రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వర రావు చొరవతో మండపేట పట్టణం లోని 25వ వార్డు రైతు బజార్ వద్ద శ్రీ విజయదుర్గ ఆలయం నకు దక్షిణ భాగంలో ఖాళీగా ఉన్న స్ధలంలో రూ. 50.00 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టనున్నారు. పట్టణ ప్రజలు టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే వేగుళ్ళ ను కలసి కృతజ్ఞతలు తెలియజేశారు.