ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నుంచి రాష్ట్రానికి వరుసగా సంస్థల్ని కేటాయిస్తున్నకేంద్ర ప్రభుత్వం తాజాగా కోనసీమ జిల్లాలోని నదీ ముఖద్వారం అంతర్వేదికి గుడ్ న్యూస్ చెప్పింది. అంతర్వేదికి ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఓ కీలకమైన సంస్థను ఇక్కడ కేటాయించింది. దాదాపు రెండు వేల కోట్ల రూపాయల ఖర్చుతో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అంతర్వేదిలో డ్రెడ్జింగ్ హార్బర్, స్కిల్ డెవలప్మెంట్ స్కూల్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్రం అంగీకరించింది.