కపిలేశ్వరపురం మండలంలో ఈదురు గాలులతో భారీ వర్షం

66చూసినవారు
కపిలేశ్వరపురం మండలం వ్యాప్తంగా పలు ప్రాంతాలలో శుక్రవారం భారీ వర్షం దంచికొట్టింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఒక్కసారిగా ఈదురు గాలులు వీస్తూ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమలమమయ్యాయి. రహదారులపై వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

సంబంధిత పోస్ట్