మండపేట మండలం, ఏడిద గ్రామంలో దేవుడు చేను కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధితులను ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు శుక్రవారం పరామర్శించారు. బాధితులు గేదెల వరలక్ష్మి, సిర్రా అన్నపూర్ణ, పల్లేటి వినోద్ కుమార్ కు చెందిన భవనం పాక్షికంగా దెబ్బ తినటంతో వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే వేగుళ్ళ రూ. 5 వేలు, నిత్యవసర సరుకులు అందజేశారు.