బాణాసంచా కాల్చుతుండగా తారాజువ్వ పడి పాక దగ్ధమైన ఘటన ముమ్మిడివరంలో బుధవారం చోటుచేసుకుంది. ముమ్మిడివరం నగర పంచాయతీ పల్లెపాలెంలో బాణాసంచా కాల్చుతుండగా తారా జువ్వ పడి పాక దగ్ధమైంది. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.