కాట్రేనికోన: సముద్రంలో చిక్కుకున్న 14 మంది సురక్షితం

58చూసినవారు
కాట్రేనికోన: సముద్రంలో చిక్కుకున్న 14 మంది సురక్షితం
కాట్రేనికోన మండలం కొత్తపాలెం వద్ద భైరవపాలానికి 7.6 నాటికల్ మైళ్ల దూరంలోని సముద్ర జలాల్లో యాంత్రిక లోపంతో రెండు మత్స్యకార బోట్లు నిలిచిపోయాయి. వాటిలో చిక్కుకున్న 14 మంది మత్స్యకారులను ఎస్పీ కృష్ణారావు పర్యవేక్షణలో మెరైన్ ఇన్ స్పెక్టర్ మూర్తి ఆధ్వర్యంలో ఇండియన్ కోస్టల్ గార్డు సిబ్బంది, ఓడలరేవు కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, అల్లవరం పోలీసులు శుక్రవారం సురక్షితంగా బోటులో ఒడ్డుకు చేర్చారు.

సంబంధిత పోస్ట్