ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సీఐటీయూ) పిలుపుమేరకు ఆదివారం ముమ్మిడివరం నగర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు నిరసన చేపట్టారు. కార్మికుల సంఖ్య పెంచాలని, పనిముట్లు రక్షణ పరికరాలు సౌకర్యాలు కల్పించాలని, వాహన మరమ్మతులు చేయించాలని, చట్టబద్ధమైన సెలవులు అమలు చేయాలని, ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నంబర్ 36 అమలు చేయాలని, బదిలీ, ఎన్ఎంఆర్ కార్మికుల బకాయి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.