ఇటీవల కురిసిన వర్షాలకు వృద్ధగౌతమి గోదావరి కుడిగట్టు కుండలేశ్వరం వద్ద కుంగిన ఏటిగట్టు రోడ్డుకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. సుమారు 50 మీటర్ల మేర ఇక్కడ రోడ్డు కుంగింది. దీనిని పరిశీలించిన కలెక్టర్ మహేష్ కుమార్ గ్రావెల్ తో కుంగిన ప్రాంతాన్ని పూడ్చాలని ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు గ్రావెల్ తో కుంగిన ప్రాంతాన్ని పూడ్చే పనులను సోమవారం ప్రారంభించారు.