నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీ కోట సత్తెమ్మ వారిని శనివారం మంత్రి కందుల దుర్గేశ్ దర్శించుకున్నారు. విజయ దశమి పర్వదినం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు. ముందుగా ఆయనకు ఆలయ కార్య నిర్వహణ అధికారి హరి సూర్య ప్రకాశ్ స్వాగతం పలికారు. ఆయన వెంట దేవదాయ శాఖ అధికారులు, కూటమి నాయకులు ఉన్నారు.