నిడదవోలు మండలం సమిశ్రగూడెం ప్రధాన కాలువపై ఉన్న వంతెన వద్ద శుక్రవారం సాయంత్రం భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదే సమయంలో పాఠశాలలు వదలడంతో స్కూల్ బస్సులతో పాటు ఇతర వాహనాల కారణంగా మూడు వైపులా పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.