నిడదవోలు మండలంలోని తిమ్మరాజుపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీకోటసత్తెమ్మ అమ్మవారికి రాజమండ్రి నగరానికి చెందిన ఇరదల సత్య రాజ్ కుమార్, ఝాన్సీరాణి దంపతులు అమ్మవారికి 375 గ్రాములు వెండి తీర్థం గిన్నె ఆదివారం బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ వి. హరి సూర్య ప్రకాష్, దేవులపల్లి రవిశంకర్ పాల్గొన్నారు.