మెగా నేత్ర చికిత్స వైద్య శిబిరం

80చూసినవారు
మెగా నేత్ర చికిత్స వైద్య శిబిరం
నిడదవోలు మండలం డి. ముప్పవరం ఎంపీపీ పాఠశాల ఆవరణలో రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు, రాజేశ్వరీ లయన్స్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో మెగా నేత్ర వైద్య చికిత్స శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు అధ్యక్షులు కీర్తి ఆంజనేయులు మాట్లాడుతూ. ఈ శిబిరంలో 156 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా వీరిలో 18 మందికి కంటి ఆపరేషన్లు, 62 మందికి మందులు కళ్ళజోళ్ళు ఉచితంగా పంపిణీ చేశామన్నారు.

సంబంధిత పోస్ట్