మన పెద్దాపురం గ్రూప్ ఆధ్వర్యంలో అన్నదానం

50చూసినవారు
మన పెద్దాపురం గ్రూప్ ఆధ్వర్యంలో అన్నదానం
కాకినాడ జిల్లా పెద్దాపురం ఏరియా ఆసుపత్రిలో మన పెద్దాపురం గ్రూప్ మాతృత్వం కార్యక్రమంలో భాగంగా సుమారు 150 మంది గర్భిణీలకు 80 మంది వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. వారంలో ఒకరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏరియా ఆసుపత్రిలో నిర్వహించనున్నట్లు మన పెద్దాపురం గ్రూప్ అడ్మిన్ పెద్దిరెడ్డి నరేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మన పెద్దాపురం ఫేస్ బుక్ గ్రూప్ ఫ్రెండ్స్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్