ప్రస్తుత కోవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులతో పాటు మొదటి సంవత్సరం అడ్మిషన్లు చేసుకున్న విద్యార్థులకు ఆన్‌లైను తరగతులను నిర్వహించాలని సివ్ ప్రొఫెసర్ పాడిలి యర్రన్న ఆదేశించారు. సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న ఒకేషనల్ కోర్సు లైన్ మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, ఆటోమొబైల్, గార్మెంట్ టెక్నాలజీ, ఎంపి హెచ్ డబ్ల్యూ ల్యాబ్ లను ఆయన ఆకస్మికంగా విచ్చేసి ల్యాబుల్లో సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ద్యావకుల సమావేశంలో మాట్లాడారు.
ప్రధానంగా ప్రస్తుత పరిస్థితుల్లో జియో టీవిలో ఆన్లైను తరగతుల ప్రసారానికి గానూ అధ్యాపకులు నూతన సాంకేతిక పద్ధతులను అలవర్చుకోవాలన్నారు. అలాగే రెండో సంవత్సరం విద్యార్ధులకు అప్రంటీస్ శిక్షణకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కళాశాల అభివృద్ధికి చేస్తున్న కృషిని కళాశాల ప్రిన్సివల్ ఐ.శారద వివరించారు. కళాశాలలో ఎన్‌సిసి, ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల ప్రగతిని ప్రొఫెసర్ యర్రన్నకు వివరించగా దానికి ఆయన ప్రిన్సిపాల్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాలలోని అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.