పరిశుభ్రతపై అవగాహన ర్యాలీ

146చూసినవారు
పరిశుభ్రతపై అవగాహన ర్యాలీ
పరిశుభ్రత ద్వారానే ప్రజారోగ్యం సాధ్యం అవుతుందని నినాదిస్తూ సామర్లకోట పట్టణంలో అధికారులు పరిశుభ్రతపై అవగాహనా ర్యాలీని నిర్వహించారు. మంగళవారం మధ్యహ్నం ఈ ర్యాలీని మండల పరిషత్ కార్యాలయం వద్ద తహశీల్దారు వజ్రపు జితేంద్ర ప్రారంభించారు. అనంతరం ర్యాలీ ఫెన్షన్లైను వరిసర ప్రాంతాల్లో నిర్వహించి వరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తద్వారా వ్యాధుల నుంచి భయటపడాలని నినాదాలిచ్చారు.

పరిశుభ్రత పక్షత్సవాల్లో భాగంగా ఈ ర్యాలీని నిర్వహిస్తున్నట్టు ఈ సందర్భంగా ఈవోపీఆర్టీ సూర్యనారాయణ చెప్పారు. కాగా ఈ ర్యాలీలో ఇంకా మండల విద్యాశాఖాధికారి వాణీ కుమారి, మండల వ్యవసాయాధికారి సత్య, ఎపివో జగదీశ్వరి, ఐసిడిఎస్ సిబ్బంది, పంచాయితీ కార్యదర్శులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, వాలంటీర్లు, మండల పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్