సామర్లకోట మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డులో మేజర్ డ్రైనేజీ నిర్వహణ లోపంతో అక్కడి ప్రజలు ఇళ్లలో నివసించలేని విధంగా ఇబ్బందులను అనుభవిస్తున్నారు. మున్సిపల్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదని వార్డు ప్రజలు వాపోతున్నారు.25 వార్డులోని వేలంపేట రామాలయం వీధిలో ఇళ్లకు మధ్యలో ఉన్న మేజర్ డ్రైన్ లో పలు విధాల వ్యర్ధాలు కొట్టుకు వచ్చి కల్వర్టు వద్ద తిష్ట వేసి ఉండిపోవడంతో దోమలు విపరీతంగా పెరిగి వార్డు ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.దోమలతో పాటు విష పురుగుల సైతం ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయని, దీనిపై మున్సిపల్ సానిటరీ సిబ్బంది ఏమాత్రం పట్టించుకోవడంలేదని వార్డు ప్రజలు ఆరోపిస్తున్నారు.పరిస్థితి ఇలా ఉంటే ఇళ్ళలో ఎలా నివసించాలని వారు అధికారులను ప్రశ్నిస్తున్నారు ఈ పరిస్థితిపై ఏమాత్రం స్పందించడం లేదని ఆరోపిస్తూ అధికారులు తక్షణం స్పందించి మేజర్ డ్రైన్ లో పూడికలు తొలగించి, దోమల నిర్మూలనకు మందులను పిచికారి చేసి, ప్రజారోగ్యాన్ని కాపాడాలని వార్డు ప్రజలు కోరుతున్నారు.