వైసిపి క్రిస్టియన్ మైనారిటి జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎండ్లూరి

940చూసినవారు
వైసిపి క్రిస్టియన్ మైనారిటి జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎండ్లూరి
వైయస్ఆర్సీపీ జిల్లా క్రిస్టియన్ మైనారిటీ ఉపాధ్యక్షులుగా సామర్లకోటకు చెందిన దైవజనులు, లెక్చరర్ అయిన ఎండ్లూరి ప్రభాకర్ గురువారం ఎన్నికయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు దడాల జాషువా గిరి జిల్లా ఉపాధ్యక్ష పదవిని తనకు ప్రకటించినట్టు ఎండ్లూరి విలేకరులకు తెలిపారు. దైవజనులుగాను, తెలుగు లెక్చరర్ గాను, తెలుగు కవిగాను రాణిస్తున్న ఎండ్లూరికి జిల్లా ఉపాధ్యక్ష పదవిని అందించడం పట్ల సామర్లకోట పట్టణానికి చెందిన క్రైస్తవ సంఘాల నాయకులు అభినందనలు తెలిపారు. కాగా తమ నియామక ఉత్తర్వులు మరో రెండు రోజుల్లో జిల్లా అధ్యక్షులు జాషువా గిరి చేతుల మీదుగా అందుకోనున్నట్టు ఉపాధ్యక్షులు ఎండ్లూరి తెలిపారు. ఈ సందర్భంగా ఎండ్లూరి ప్రభాకర్ కు అభినందనలు తెలిపిన వారిలో మునిసిపల్ చైర్ పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి, వైస్ చైర్మన్ ఊబా జాన్ మోజేష్, మున్సిపల్ క్రిస్టియన్ మైనారిటీ కోఆప్షన్ సభ్యులు సల్లూరి కళ్యాణ్, సామర్లకోట మండల పాస్టర్ అసోసియేషన్ నాయకులు, కౌన్సిలర్లు పిట్టా సత్యనారాయణ, పాలిక కుసుమ చంటిబాబు, మర్రి శేషారావు తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్