సామర్లకోట పట్టణ పరిధిలో పలు ప్రధాన కాలువలలో పూడిక తొలగింపు పనులను టీ డీ పీ నాయకులు, మునిసిపల్ కమీషనర్ జాస్తి రామారావులు మంగళవారం పరిశీలించారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయలు చినరాజప్ప చొరవతో సామర్లకోట పట్టణ పరిధిలో మేజర్ డ్రైనేజీలలో పూడిక తీయడానికి రూ. 36 లక్షలు నిధులు మంజూరయ్యాయి. పట్టణంలోని పలు మేజర్ డ్రైనేజీలలో పూడిక తీత పనులు చేపట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగా మంగళవారం పనులు పరిశీలించారు.