కాకినాడ జిల్లా, పెద్దాపురం మున్సిపల్ పరిధిలోని పోరంబోకు భూములు వైసీపీ నేతలు ఆక్రమణ చేసి అమ్ముకున్నారని ఈనాడు దినపత్రికలో కథనాలు వచ్చాయి. తమకు వ్యతిరేకంగా వచ్చిన కథనాలను వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే గత నెల 31వ తేదీన కౌన్సిల్ సమావేశంలో సదరు దినపత్రిక ప్రతినిధిపై వైసీపీ పార్టీకి చెందిన వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్ విరుచుకుపడ్డారు. దీనిని నిరసిస్తూ సోమవారం నిరసన ప్రదర్శన చేసారు.