భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా 15 రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పెద్దాపురం, పిఠాపురం నియోజక వర్గాల ప్రధాని మోదీ జన్మదినోత్సవాల ప్రోగ్రాం ఇంచార్జ్ గొరకపూడి చిన్నయ్యదొర తెలిపారు. మంగళవారం ప్రధాని జన్మదినం పురస్కరించుకుని బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ వద్ద పేదలకు ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేశారు. పెద్దాపురంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.