3వ వార్డులో ఆదివారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో డేగల కోటీశ్వర్రావుకు చెందిన తాటాకిల్లు పూర్తిగా దగ్దమైంది. దానితో ఆ కుటుంబానికి సుమారుగా 2 లక్షలు ఆస్థినష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు. ఉదయం 11 గంటల సమయంలో ఇంటికి ఉన్న విద్యుత్ మీటరు ద్వారా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయి మంటలు రేగాయి. అయితే ఆ సమయానికి బాధితులు కోటీశ్వర్రావు చిన్న సంఘానికి పాస్టర్ గా ఉంటూ రాజీవ్ గృహకల్పలో ఆదివారం కావడంతో చర్చిలో ఉండటంతో ఇల్లు దగమైన సంగతి తెలిసి వెళ్ళేసరికే ఇల్లు మొత్తం కాలి బూడిదైంది. కాగా ప్రమాదానికి గురైన గృహాన్ని పెద్దాపురం నియోజకవర్గ ఇంచార్జ్ దవులూరి దొరబాబు సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో హోసింగ్ పథకంలో గృహ నిర్మాణాలకు ఇళ్ళు మంజూరవుతున్న నేపధ్యంలో మొదటి విడతలో పక్కాఇల్లు నిర్మాణానికి కృషి చేయనున్నట్టు చెప్పారు. కాగా కుటుంబానికి వ్యక్తిగతంగా తక్షణ సహాయాన్ని అందించనున్నట్టు ఆయన ప్రకటించారు. కాగా మంటలను అదుపు చేయడంలో పెద్దాపురం అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సేవలనందించారు. ఈ సందర్భంగా ఇంచార్జి దొరబాబు వెంట వార్డు వైసీపీ ఇంచార్జి రెడ్డి శ్రీను, పార్టీ నాయకులు సల్లూరి కళ్యాణ్ తదితరులున్నారు.