సామర్లకోట పట్టణం 3వ వార్డులో ఆదివారం సంభవించిన అగ్ని ప్రమాదంలో సర్వ కోల్పోయిన బాధిత కుటుంబమైన డేగల అబ్రహాం(కోటీశ్వర్రావు) కుటుంబానికి సామర్లకోట, పెద్దాపురం పట్టణాలకు చెందిన వలువురు పాస్టర్లు ఎవరికి వారే వ్యక్తిగతంగా సహాయ కార్యక్రమాలను చేపట్టారు.సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సామర్లకోటకు చెందిన బన్ను ప్రసాద్ 50 కిలోల బియ్యం, కొత్త దుస్తులు, ఆర్థిక సహాయాన్ని అందించగా, దైవజనులు బ్లెస్సింగు కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించారు.
అలాగే పాస్టర్ బి సత్యానందం బాధిత కుటుంబానికి వంటసామాన్లను అందించగా, పెద్దాపురం పట్టణానికి చెందిన పాస్టర్ చందు నెల రోజులకు సరిపడా కిరాణా సామాన్లను అందించి ఆదుకున్నారు. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడిన పాస్టర్ అబ్రహాం కుటుంబాన్ని ఇంకా సామర్లకోట, పెద్దాపురం పట్టణాలకు చెందిన దైవజనులు వారి స్తోమతను బట్టి పలువురు సహాయాలను అందించినట్టు వారు చెప్పారు. ప్రార్దించే పెదవుల కన్నా సాయంచేసే చేతులు మిన్న అన్న దేవోక్తిని జ్ఞాపకం చేసుకుంటూ తమవంతు చిన్నపాటి సహాయాలను బాధిత కుటుంబానికి అందించినట్టు దాతలు చెప్పారు.