తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట ఆర్టీసి బస్టాండులో ప్రయాణీకుల రక్షణకు సంబందించి ప్రయాణీకులు వేచి ఉండే భవనం శిధిలావస్థకు చేరి శ్లాబు పెచ్చులు ఊడి ప్రయాణీకులపై పడుతూ గాయాల పాలవుతున్నారు. వాటికి మరమ్మతు పనులను మంగళవారం ప్రారంభించారు. ఆర్టీసీ కాకినడ డిపో మేనేజర్ ఆధ్వర్యంలో ఈ పనులను ఆర్టీసీ ఇంజనీరు పర్యవేక్షణలో ఈ పనులను ప్రారంభించారు.
శిథిలమైన శ్లాబును బద్దలుకొట్టి దాని స్థానంలో రేకుషెడ్డు నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్టు అధికారులు చెప్పారు. ఇంకా ఆర్టీసీ కాంప్లెక్స్ భవనం శిథిలావస్థకు చేరగా శిథి లమైన చోట్ల రిపేరు పనులను చేపడుతున్నట్టు వారు చెప్పారు. రిపైరు పనులకు గానూ ఆర్టీసి నుంచి కొంత నిదులు రాగా వాటితో తాత్కాలిక మరమ్మతు పనులను చేవడుతున్నట్టు చెప్పారు.
అయితే మంగళవారం రైతు బందు కారణంగా మధ్యాహ్నం వరకు బస్సుల రాకపోకలు నిలిచిపోవడంతో కాంప్లెక్స్ లో ప్రయాణీకులు లేని సమయాన్ని చూసి ఉదయం నుంచి మధ్యహ్నం వరకు శిథిల శ్లాబును తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. వెనువెంటనే శిథిలాలను ట్రాక్టర్ సహాయంతో తొలగించి మద్యహ్నం తరువాత వచ్చే బస్సుల రాకపోకలకు, ప్రయాణీకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్త చర్యలు యుద్ధప్రాతిపదికన ఆర్టీసీ అధికారులు చేపట్టారు.