సామర్లకోటలో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

3225చూసినవారు
సామర్లకోటలో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు
దాడి చేసి కులం పేరుతో దూసించారని పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు సామర్లకోట పోలీసులు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సామర్లకోట ఉపువారి వీధిలో వార్డు వాలంటీర్ గా సురేష్ పనిచేస్తున్నాడు. వాలంటీర్ ఈనెల 21వ తేదీన ఇంటిపన్నుల డిమాండ్ నోటీసు తీసుకుని తన పరిధిలోని శెట్టిబత్తుల సత్యనారాయణ ఇంటికి వెళ్లాడు. ఇంటి వద్ద శెట్టిబత్తుల సూర్యావతికి నోటీసు ఇచ్చాడు. సూర్యావతి ఆమె కుమారుడు ఇంటి పన్ను మీరు తెచ్చి ఇవ్వడం ఏంటి పన్ను కట్టకపోతే ఎంచేస్తావు అని వాలంటీర్ తో గొడవకు దిగి కులం పేరుతో దూషించారని సచివాలయంలో చెప్పినా పట్టించుకోలేదన్నాడు.

తమ కుల పెద్దలకు విషయాన్ని చెప్పడంతో బుధవారం శెట్టిబత్తుల సూర్యవతి ఇంటికి వెళ్లి కులం పేరుతో ఎందుకు దూషించారని అడగగా అగ్రవర్ణానికి చెందిన వారు తమపై దాడికి దిగి కర్రలతో, బ్లేడుతో దాడి చేసి గాయపర్చారని కుమ్మర వీధికి చెందిన వేముల నవీన్ పిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్షతగాత్రుడు నవీన్ ను ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స చేయించారు. బాధితుడు పిర్యాదు మేరకు ఎస్సై సుమంత్ కేసు నమోదు చేశారు.

ఈ సందర్భంగా శెట్టిబత్తుల సూర్యవతి, సూర్యవతి కుమారుడు, జట్ల మోహన్, బోండు రాజు, డేగల, చంద్రశేఖర్, కృష్ణ సురేష్ నాగు. బాలు, స్వామి తదితరులపై ఎస్సీఎస్టీ కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్ఫార్పీఎస్ జిల్లా నాయకులు వల్లూరి నాని మాదిగ, మాలమహానాడు నాయకులు కొంగు సందీప్ మాట్లాడుతూ దళితులమైన తమను అగ్రవర్ణాలకు చెందిన వారు కులం పేరుతో దూషించారని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్