అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం

61చూసినవారు
అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం
గొల్లప్రోలు మండలంలో చేబ్రోలుకు చెందిన బేతా వెంకటేశ్వర్లు (48) ఆగష్టు 25న అదృశ్యం కాగా స్థానిక కోటలంకవారి చెరువులో అతడి మృతదేహం శుక్రవారం లభ్యమైనట్లు ఎస్ఐ ఎన్. రామకృష్ణ తెలిపారు. అతడి భార్య రత్నం ఆగష్టు 28న ఫిర్యాదు చేశారని, మృతదేహం లభ్యం కావడంతో అనుమానాస్పద మృతిగా కేసు మార్పు చేసినట్లు చెప్పారు. చేసిన అప్పులకు సంబంధించి అడుగుతుండటంతో మనస్తాపంతో వెళ్లిపోయినట్లు ఫిర్యాదు చేశారన్నారు.

సంబంధిత పోస్ట్