గొల్లప్రోలు నగర పంచాయతీకి శని, ఆదివారాల్లో మంచినీటి సర ఫరాకుసరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని కమిషనర్ రవికుమార్ శుక్రవారం ఓ ప్రక టనలోప్రకటనలో తెలిపారు. తాటిపర్తి నుంచి గొల్లప్రోలు వచ్చే మంచినీటి పైపులైన్ మార్పు చేసే పనులు జరుగుతున్న నేపథ్యంలో మంచినీటి సరఫరా నిలిచిపోతుందన్నారు. కావున గొల్లప్రోలు పట్టణ ప్రజలు ముందస్తుగా మంచినీటిని నిల్వ చేసుకోవాలని కమిషనర్ రవికుమార్ కోరారు.