పిఠాపురం మండలం ఎఫ్. కె. పాలెం గ్రామంలో సాలిడ్, లిక్విడ్ రిసార్స్ మేనేజ్మెంట్ పైలట్ ప్రాజెక్ట్ ను ఎమ్మెల్సీ హరిప్రసాద్ బుధవారం ప్రారంభించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో తన సొంత నియోజకవర్గంలో ప్రారంభమైన ఎస్ఎల్ఆర్ఎం లో భాగంగా గణ ద్రవ వ్యర్ధాలను వేరుచేసి వాటి ద్వారా సంపద సృష్టికై శాస్త్రవేత్త శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ పైలట్ ప్రాజెక్టు నిర్వహణ చేయడం జరిగిందని, త్వరలోనే సక్సెస్ అవుతుందని తెలిపారు.