ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) లో ప్రజల నుంచి వచ్చిన సమస్యల పరిష్కారానికి సమన్వయ కమిటీ భేటీ అయింది. గురువారం పెద్దాపురం తాహశీల్దార్ కార్యాలయంలో సమన్వయ కమిటీ కన్వీనర్, తాహశీల్దార్ సీహెచ్ వెంకటలక్ష్మి, సభ్యులు ఎంపీడీవో డి. శ్రీలలిత, ఎస్ఐ వి. మౌనిక సమీక్షించారు. పెద్దాపురం మండలం దివిలి గ్రామం నుంచి వచ్చిన సమస్యల అర్జీలపై పరిష్కార మార్గలపై చర్చించారు.