పిఠాపురం నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు సర్కిల్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గోల్లప్రోలు జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ చేయగా.. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానా విధిస్తూ.. అదే క్రమంలో హెల్మెట్ ధరించిన వాహనదారులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎస్పీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు సీఐ శ్రీనివాస్ పేర్కొన్నారు.